Parvathipuram: గుమ్మలక్ష్మీపురంలో 'నాటు వైద్యానికో నమస్కారం' సదస్సు

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో "నాటు వైద్యానికో నమస్కారం, లార్వా వేట" కార్యక్రమాలపై డిఎంహెచ్ఓ డా. ఎస్. భాస్కరరావు ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.

V.SESHU	, KURUPAM
Published on: 17 May 2026 6:27 AM IST
Parvathipuram
X

Parvathipuram: గుమ్మలక్ష్మీపురంలో 'నాటు వైద్యానికో నమస్కారం' సదస్సు

Parvathipuram: శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు సూచించారు. నాటు వైద్యానికో నమస్కారం, లార్వా వేట కార్యక్రమాలపై అవగాహన సదస్సును గొరడ గ్రామంలో శనివారం నిర్వహించారు. డిఎంహెచ్ఓ ప్రోగ్రాం అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని పలు ఆరోగ్య అంశాలపై తెలియజేసి, అవగాహన కల్పించారు. నాటు వైద్యం, మలేరియా రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ గారు ఈ వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టారని, వీటిపై జిల్లా వ్యాప్తంగా, విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

నాటు వైద్యం వల్ల శరీరంలో ముఖ్య అవయవాలు ఇన్ఫెక్షన్ కు గురవుతాయని, ప్రాణ హాని కూడా సంభవిస్తుందని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు గ్రామస్థాయిలో ఆశా, ఏఎన్ఎమ్ లను సంప్రదించాలని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం, వైద్యులు అందుబాటులో ఉన్నారని, సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులో వైద్యం పొందాలని సూచించారు. దోమల లార్వా గుర్తించి, నిర్మూలించడమే "లార్వా వేట" ఉద్దేశ్యమని అన్నారు.

లార్వా శాంపిల్స్ ను గ్రామస్తులకు,పిల్లలకు చూపించి అవగాహన కల్పించారు. అక్కడ వైద్యారోగ్యశాఖ సిబ్బంది "నాటు వైద్యానికో నమస్కారం" పై ప్రదర్శించిన లఘునాటిక విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం రేగడి పిహెచ్సీ లో రేగిడి,దుద్దుఖల్లు ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో వైద్య సేవలపై నివేదికలను పరిశీలించారు. ప్రజారోగ్యమే ద్యేయంగా పని చేయాలని, వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్.సి.డి అధికారి డా టి. జగన్ మోహనరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డా. సూర్య కౌశిక్, డిఎంఓ డి. సూర్యనారాయణ, వైద్యాధికారులు డా బి. రాజ్ మనోహర్, డా దిలీప్ కుమార్, డిప్యూటీ డెమో గిరిబాబు, ఇంచార్జి డిపిహెచ్ఎంఓ విజయలక్ష్మి, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణంరాజు, పెంటమ్మ , రాజేశ్వరి వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story