Cheepurupalli: గరివిడి మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి కిమిడి సంధ్య ఇంటింటి ప్రచారం!
Cheepurupalli: గరివిడి మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి కిమిడి సంధ్య విస్తృత ప్రచారం. బాగువలస, వెదుళ్లవలస గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాయుడు.
Cheepurupalli: గరివిడి మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి కిమిడి సంధ్య ఇంటింటి ప్రచారం!
Cheepurupalli: గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారు మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని ముందుకు నడిపించారు.
ప్రచారంలో భాగంగా బాగువలస, వెదుళ్లవలస గ్రామాల్లో నేతలు విస్తృతంగా పర్యటించారు. ప్రజా నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ఎన్డీయే కూటమి మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారి నాయకత్వంలో నియోజకవర్గంతో పాటు గరివిడి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తామని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు.
ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిమిడి సంధ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో ఎన్డీయే కూటమి నాయకులు, స్థానిక టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




