Kurupam: రోడ్డుపై పడిన భారీ చెట్టు తొలగింపు - ట్రాఫిక్ పునరుద్ధరణ!
Kurupam: కురుపాం మండలం నీలకంఠాపురం వద్ద రోడ్డుకు అడ్డంగా కూలిన భారీ చెట్టు. ఎస్సై రమేష్ నాయుడు ఆధ్వర్యంలో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు.
Kurupam: రోడ్డుపై పడిన భారీ చెట్టు తొలగింపు - ట్రాఫిక్ పునరుద్ధరణ!
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని నీలకంఠాపురం గ్రామం – ధర్మలక్ష్మీపురం గ్రామాల మధ్య శిరిడి సాయిబాబా ఆలయం సమీపంలో గురువారం ఉదయం భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే నీలకంఠాపురం ఎస్సై పి. రమేష్ నాయుడు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న చెట్లు కట్ చేసే యంత్రాన్ని వినియోగించి చెట్టును ఐదు ముక్కలుగా కట్ చేయించారు. అనంతరం పోలీసు సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో చెట్టు ముక్కలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
పోలీసుల వేగవంతమైన చర్యలతో రోడ్డుపై ఏర్పడిన అంతరాయం తొలగిపోయి ప్రస్తుతం వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయని ఎస్సై తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు దొర, త్రినాథ్, కిరణ్, చంద్రశేఖర్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ప్రశంసించారు.




