Vizianagaram: విజయనగరం జిల్లాలో ఖాకీల ఆకస్మిక తనిఖీలు

Vizianagaram: "ఆపరేషన్ వజ్రప్రహార్"లో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరంలో భారీ ‘కార్డన్ అండ్ సెర్చ్’ తనిఖీలు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 19 Jun 2026 9:08 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం జిల్లాలో ఖాకీల ఆకస్మిక తనిఖీలు

Vizianagaram: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు గజపతినగరం లో జూన్ 19 న ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ చేపట్టారు.

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*

వారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు తెల్లవారుజామున "కార్డన్ అండ్ సెర్చ్ "ఆపరేషన్ ను గజపతినగరం మండలం గ్రామం లో మేదరి వీధి ,కోనేటి గట్టు ,కుమ్మర వీధి, రెల్లి వీధి చేపట్టారు.

ఏకకాలంలో బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో గజపతినగరం పోలీసు స్టేషన్ పరిధిలోని గజపతినగరం గ్రామం లో గజపతినగరం సర్కిల్ సి ఐ మరియు సర్కిల్లో పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్ .ఐ లు సిబ్బంది అందరితో కలిసి గజపతినగరం గ్రామంలో సుమారు 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సుమారు 600 ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు.

రికార్డులు సక్రమంగాలేని 21 మోటారు సైకిళ్ళును సీజ్ చేసి, గజపతినగరం పోలీసు స్టేషనుకు తరలించడం జరిగింది.

కార్డెన్ అండ్ చర్చ్ లో భాగంగా ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ నిర్వహించామని తెలిపారు.... గ్రామ ప్రజలు మరియు యువత తో సర్కిల్ సిఐ సన్యాసినాయుడు గంజాయి మరియు మత్తు పదార్థాలు పైన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story