Palakonda: పాలకొండలో రేపు తాగునీటి సరఫరా బంద్: కమిషనర్

Palakonda: విద్యుత్ అంతరాయంతో పంపింగ్ నిలిచిపోవడంతో పాలకొండ నగర పంచాయతీలోని 13 వార్డుల్లో రేపు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని కమిషనర్ తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Sept 2026 8:05 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో రేపు తాగునీటి సరఫరా బంద్: కమిషనర్

Palakonda: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో చెట్టు పడిపోవడం వల్ల విద్యుత్ వైర్లు తెగిపోయి, సంకిలి లైన్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ఎలక్ట్రిసిటీ వారు బాగు చేస్తున్నడంవల్ల అప్పుడప్పుడు కరెంటు వస్తూ పోతూ ఉన్నది తద్వారా పంపింగ్ జరగటానికి ఇబ్బందికరంగా ఉన్నది.

అందువల్ల రేపు పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకంపేట ట్యాంక్ మరియు ఆఫీస్ ట్యాంక్ పరిధిలోని 1, 2, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19 మరియు 20వ వార్డులకు నీటి సరఫరా జరగదు.

అలాగే, పంపింగ్ ప్రక్రియ జరగని కారణంగా సంబంధిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా నిర్వహించడం సాధ్యం కాదు.

కావున ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరడమైనది.

కమిషనర్

పాలకొండ నగర పంచాయతీ

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA