పాలకొండలో జగన్నాథుడి రథయాత్ర హంగామా.. సుందరంగా ముస్తాబవుతున్న నందిఘోష రథం!

పాలకొండ పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 7 July 2026 2:44 PM IST
పాలకొండలో జగన్నాథుడి రథయాత్ర హంగామా.. సుందరంగా ముస్తాబవుతున్న నందిఘోష రథం!
X

పాలకొండలో జగన్నాథుడి రథయాత్ర హంగామా.. సుందరంగా ముస్తాబవుతున్న నందిఘోష రథం!

పాలకొండ: పాలకొండ పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించబడనున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా రథయాత్ర జరిగే ప్రాంతాల్లో 11 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతిరోజూ చెత్త తొలగింపు, తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ ప్రదేశాల పరిశుభ్రత, రథం ప్రయాణించే రోడ్ మార్గాన్ని మరమ్మతులు చేసి సురక్షితంగా తీర్చిదిద్దడం, వీధి దీపాల నిర్వహణ మరియు అవసరమైన చోట అదనపు వెలుతురు ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది నియామకంతో పాటు రోడ్ల మరమ్మతులు మరియు ఇతర మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధుల కేటాయింపు గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారి చొరవతో చేపట్టబడుతుందని తెలియజేయడం జరిగింది.

అలాగే, గౌరవ పెద్దలు పల్లా కొండబాబు గారు మరియు గంటా సంతోష్ కుమార్ టీం సహాయ సహకారాలతో 2020 సంవత్సరంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించబడిన "నందిఘోష" రథం గత సంవత్సరం పూర్తిస్థాయిలో రంగులు వేయించి సుందరంగా తీర్చిదిద్దబడింది.

ఈ సంవత్సరం కూడా రథం శిఖర భాగానికి కొత్త రంగులు వేయించడం జరిగింది.తాజా పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేయడం, 24 వ తారీకు మారుదసమి రోజు ఆనవాయితీగా బాణాసంచా కాల్చడం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్ణయించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story