Palakonda: మురుగు రోడ్లపై పాదచారులు, విద్యార్థుల తీవ్ర అవస్థలు!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రధాన రహదారిపై డ్రైనేజీ మురుగునీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

SHIVA, BHIMILI
Published on: 24 Aug 2026 1:27 PM IST
Palakonda
X

Palakonda: మురుగు రోడ్లపై పాదచారులు, విద్యార్థుల తీవ్ర అవస్థలు!

పాలకొండ: ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న మురికి నీరు, పాదచారులు, వ్యాపారులు, విద్యార్థుల తీవ్ర అవస్థలు చోద్యం చూస్తున్న నగరపంచాయితీ సిబ్బంది కాలువల్లోని మురికినీరునడిరోడ్డుపై ప్రవహిస్తుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి వడమ జంక్షన్ వరకు నీరు నిలువ ఉండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ముఖ్యంగా వ్యాపారస్తులు, పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్తకులు, ప్రయాణికుల తరపున ప్రజా సంఘాలు నగరపంచాయితీ అధికారుల తీరును ఖండిస్తున్నారు. కాలువల్లోని పూడికలు కనీసం తియ్యకపోవడంతో ఎప్పుడు వర్షాలు పడినా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, సాధారణంగా రోడ్లపైన నీరు డ్రైనేజీ లోకి వెళ్లాలని కానీ పాలకొండలో విచిత్రంగా డ్రైనేజీలలోని నీరు రోడ్లపై ప్రవహిస్తుందని అన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story