Palakonda: పాలకొండలో క్రికెట్ జాతర.. విజేతలకు రూ. 50 వేల ప్రైజ్ మనీ!
Palakonda: పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు (NGR) స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ.
Palakonda: పాలకొండలో క్రికెట్ జాతర.. విజేతలకు రూ. 50 వేల ప్రైజ్ మనీ!
Palakonda: దివంగత మాజీ శాసనసభ్యులు శ్రీ నిమ్మక గోపాలరావు గారు(NGR) స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మండల పంచాయితీ కి ఓ టీమ్ తరుపున ఎంపిక చేసి ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ తనతండ్రి దివంగత మాజీ శాసనసభ్యులు నిమ్మక గోపాలరావు పేరు చిరస్థాయిలో నిలిచేవిధంగా పాలకొండ నియోజకవర్గవ్యాప్తంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నామని తెలిపారు. మండల పంచాయితీల నుండి టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నాయని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి 50వేలు, 2వ బహుమతి 30వేలు అందజేస్తామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.
Next Story




