Palakonda: పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌గా పల్లా విజయనిర్మల!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌గా పల్లా విజయనిర్మల ఎన్నికయ్యారు. కూటమి అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పేర్కొన్నారు.
Palakonda: పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌గా పల్లా విజయనిర్మల!
పాలకొండ: నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్మన్ గా పల్లా విజయనిర్మలను ప్రజలు ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికలు అధికారులుసంబంధిత పత్రాలు ఛైర్మన్ కి అందించారు. అనంతరం స్థానిక జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ పాలకొండ కి పల్లా కొండబాబు సరైన అభ్యర్ధి అని సర్వేలు తెలిపాయని అన్నారు. చైర్మన్ పల్లా విజయనిర్మలకు గెలిచిన కూటమి అభ్యర్ధులకు ,ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి ఇచ్చిన మాట ప్రకారం. పాలకొండ మున్సిపాలిటీ నీ బహుమతి గా ఇచ్చాము అని అన్నారు. కూటమి లేదు ఓటమి అని స్లోగంతో ముందుకు వెళ్లిన నానుడికి ప్రజలు మద్దతు ఇచ్చారు అని అన్నారు.
కూటమి అభ్యర్ధులకు అఖండ విజయాన్ని అందించిన పాలకొండ ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పాలకొండ అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల కూటమి అభ్యర్ధులు గెలవడం చాలా సంతోషం గా ఉందని. ప్రజలు చాలా.చక్కని తీర్పు ఇచ్చారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూసి ప్రజలు సరైన తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు.
గత వైసీపీ పాలకమండలి చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ స్థానం జనసేన కి కేటాయించడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రీతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అని చైర్మన్ పల్లా విజయనిర్మల తెలిపారు. పాలకొండ అభివృద్ధికి తన భర్త కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జి పడాల భూదేవి, నూతన మున్సిపల్ కాన్సిలార్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.




