Parvathipuram: పాలకొండలో సాధారణ స్థితికి రాకపోకలు, విద్యుత్, తాగునీరు!

Parvathipuram: అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పాలకొండలో కలెక్టర్ ఆదేశాలతో సహాయక చర్యలు ముగిశాయి. విద్యుత్, తాగునీరు, రాకపోకలు పునరుద్ధరించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 26 Sept 2026 9:55 AM IST
Parvathipuram
X

Parvathipuram: పాలకొండలో సాధారణ స్థితికి రాకపోకలు, విద్యుత్, తాగునీరు!

Parvathipuram: తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి సహాయక చర్యలను వేగవంతంగా పూర్తి చేశారు.

వర్షాలు, గాలుల కారణంగా రహదారులపై కూలిపోయిన చెట్లను, విరిగిపడిన విద్యుత్ స్తంభాలను శీఘ్రంగా తొలగించారు. ముఖ్యంగా పాలకొండ మండలంలోని అంపిలి రూట్‌తో పాటు ఇతర ప్రధాన మార్గాల్లో చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే కాకుండా, అంపిలి, అన్నవరం తదితర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా సురక్షిత తాగునీటి సరఫరాను యథావిధిగా ప్రారంభించారు.

కలెక్టర్ సూచనలతో కంట్రోల్ రూమ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తూ, లోతట్టు ప్రాంత ప్రజలకు, గర్భిణులకు ముందస్తు వైద్యారోగ్య రక్షణ చర్యలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు వేగంగా నెలకొనేలా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు పూర్తి చేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA