Palakonda: పాలకొండలో మున్సిపల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ పరిశీలన!
Palakonda: పాలకొండ నగర పంచాయతీ మున్సిపల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ పరిశీలించిన అబ్జర్వర్ చిన్న రాముడు, సబ్ కలెక్టర్ జగన్నాథ్. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఆదేశం.
Palakonda: పాలకొండలో మున్సిపల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ పరిశీలన!
Palakonda: పాలకొండ నగర పంచాయతీ మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ S చిన్న రాముడు ఐఏఎస్, సబ్ కలెక్టర్ జగన్నాథ్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసే విధానం, ఎన్నికల సామాగ్రి వినియోగం, పోలింగ్ ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని సూచించారు.
ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్వో రాధాకృష్ణ, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్, ఎస్సై వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




