Palakonda: ‘శక్తి’ టీం స్పెషల్ డ్రైవ్.. విద్యార్థులకు కీలక సూచనలు!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని శ్రీ సత్య సాయి జూనియర్ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Palakonda: ‘శక్తి’ టీం స్పెషల్ డ్రైవ్.. విద్యార్థులకు కీలక సూచనలు!
పాలకొండ: శక్తి టీమ్ వారు పాలకొండ టౌన్ లో శ్రీ సత్య సాయి జూనియర్ కళాశాల, విద్యార్థి విద్యార్థునులకు కోసం ప్రతి ఒక్కరు మొబైల్స్ లోనూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి యాప్ లొ ఉండే లెవెన్ ఫీచర్స్ గురించి చెప్పి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం జరిగింది.
మీ స్నేహితులతో బయటకు వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రులకు తప్పనిసరిగా చెప్పాలి అదేవిధంగా తిరిగి వచ్చేంతవరకు మీ తల్లిదండ్రులకు తో కమ్యూనికేషన్ లో ఉండాలి, తెలియని వ్యక్తులు ఎటువంటి ఆహార పదార్థాలు గానీ పానీయాలు గాని ఇచ్చిన తీసుకోకూడదు, బాల్యవివాహాలు గురించి, ఫోక్సో చట్టం గురించి,సోషల్ మీడియా అవగాహన కార్యక్రమం నిర్వహించాం.
ఈ కార్యక్రమంలో ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ట్విస్టర్, ఫేస్బుక్, టెలిగ్రామ్, వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సురక్షితంగా ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు వివరించడం. అలాగే సైబర్ నేరాలు, ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాలు గురించి అవగాహన కల్పించి, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం ఎంత ముఖ్యమో తెలపడం జరిగింది.
విద్యార్థులు సోషల్ మీడియాను బాధ్యతతో ఉపయోగించాలి అని సూచించారు. ఆన్‌లైన్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులుకు, కళాశాల ప్రిన్సిపాల్ గారికి లేదా పోలీసులకు తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు మహిళ ఏఎస్ఐ ఝాన్సీ భాయ్, మహిళ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ ప్రకృతాంబ, కానిస్టేబుల్ రాము, చంద్రశేఖర్, కళాశాల కరెస్పాండెంట్ డి వెంకటరమణ గారు, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ సింహాచలం గారు, మిగతా సిబ్బంది పాల్గొన్నారు.




