Parvathipuram: పింఛన్ల పంపిణీలో కలెక్టర్ సందడి.. అవ్వాతాతలతో ఆత్మీయ సంభాషణ!

Parvathipuram: పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పట్టణంలోని 10వ వార్డులో పర్యటించి 'ఎన్.టి.ఆర్ భరోసా' పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 1 May 2026 1:00 PM IST
Parvathipuram
X

Parvathipuram: పింఛన్ల పంపిణీలో కలెక్టర్ సందడి.. అవ్వాతాతలతో ఆత్మీయ సంభాషణ!

పార్వతీపురం: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఎన్.టి.ఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. పార్వతీపురం పట్టణ పరిధిలోని 10వ వార్డులో గల బంధం వారి వీధిలో ఆయన స్వయంగా ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును పంపిణీ చేశారు.

ఆత్మీయ పలకరింపు

పింఛన్ పంపిణీ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించారు. "అవ్వా.. ఆరోగ్యం ఎలా ఉంది? మందులు వేసుకుంటున్నారా?" అని ఆరా తీస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

పెరిగిన భరోసా

పెంచిన పింఛన్ సొమ్ము వారి జీవన ప్రమాణాలకు ఏ విధంగా తోడ్పడుతోందో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు స్పందిస్తూ.. ఇంటి వద్దకే పింఛన్ అందడం వల్ల తమకు ఎంతో ఆసరాగా ఉందని, ఆర్థికంగా భరోసా లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో నగదు అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story