Parvathipuram: జలజీవన్ మిషన్ పనులపై కలెక్టర్ డాక్టర్ ప్రభాకర రెడ్డి సమీక్ష

Parvathipuram: పార్వతీపురం మన్యం కలెక్టరేట్‌లో జలజీవన్ మిషన్ తాగునీరు, పారిశుధ్య పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 27 July 2026 8:03 PM IST
Parvathipuram
X

Parvathipuram: జలజీవన్ మిషన్ పనులపై కలెక్టర్ డాక్టర్ ప్రభాకర రెడ్డి సమీక్ష

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జలజీవన్ మిషన్ తాగునీరు మరియు పారిశుధ్య కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సోమవారం ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన వివిధ తాగునీటి సరఫరా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

​జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో తాగునీటి సౌకర్యంతో పాటు మెరుగైన పారిశుధ్య వసతులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా వసతులు కావలసిన చోట సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు మరియు ప్రాంగణాలలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. సదుపాయాలు లేని చోట వెంటనే ప్రతిపాదనలు ఇస్తే మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీల పనితీరును మెరుగుపరచాల్సి ఉందన్నారు. ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, ఆ వివరాలను జలజీవన్ మిషన్ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.​ఈ సమావేశంలో జిల్లా నీటి సరఫరా మరియు పారిశుధ్య మిషన్ అధికారి పి. మధుకుమార్ రెడ్డితో పాటు వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story