Parvathipuram: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి కలెక్టర్!
Parvathipuram: పార్వతీపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వీసీ ద్వారా సమీక్ష. సన్నద్ధంగా ఉండాలని ఆదేశం.
Parvathipuram: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి కలెక్టర్!
Parvathipuram: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఉద్బోదించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల లభ్యత, ఓట్ల లెక్కింపు కేంద్రాల (కౌంటింగ్ సెంటర్లు) ఏర్పాటుపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల సన్నాహక విధులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా పూర్తి బాధ్యతను తీసుకోవాలని, ఎన్నికల నిర్వహణలో సమగ్ర సమాచారంతో పాటు, పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.రవీంద్ర, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పి సీఈఓలు ఆర్.వెంకట్రామన్, లోవరాజు, డీఎల్డీఓ ఫణీంద్ర, వివిధ మునిసిపాలిటీల కమిషనర్లు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




