Parvathipuram: వైద్య సీట్ల ప్రవేశాల్లో జీవో 102 రద్దు చేయాలి: సీపీఐ

Parvathipuram: వైద్య సీట్ల ప్రవేశాల జీవో 102ను రద్దు చేసి, జీవో 151ని కొనసాగించాలని సీపీఐ నేత ఆర్వీఎస్ కుమార్ డిమాండ్ చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 4 Aug 2026 1:36 PM IST
Parvathipuram
X

Parvathipuram: వైద్య సీట్ల ప్రవేశాల్లో జీవో 102 రద్దు చేయాలి: సీపీఐ

పార్వతీపురం మన్యం జిల్లా..

వైద్య సీట్ల ప్రవేశాల్లో జీవో 102 రద్దు చేయాలి: సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ కుమార్

పార్వతీపురం: వైద్య సీట్ల ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 102ను వెంటనే రద్దు చేసి, హైకోర్టు మార్గదర్శకాల మేరకు అమలులో ఉన్న జీవో ఎంఎస్ నెం.151ను యథాతథంగా కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేసినట్లు సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ కుమార్ తెలిపారు. జీవో 102 వల్ల రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, ఓపెన్ కేటగిరీలో సీటు పొందే అర్హత ఉన్న విద్యార్థులను కూడా రిజర్వేషన్ కోటాలోనే పరిగణించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు సూచనల మేరకు నిపుణుల కమిటీ సిఫార్సులతో తీసుకొచ్చిన జీవో 151 అమలులోకి వచ్చిన తర్వాత వైద్య ప్రవేశాలు ఎలాంటి వివాదాలు లేకుండా సాగుతున్నాయని తెలిపారు. అందువల్ల రిజర్వేషన్ వర్గాల హక్కులు కాపాడేందుకు జీవో 102ను రద్దు చేసి, జీవో 151ను కొనసాగించాలని ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని కుమార్ తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story