Parvathipuram: పార్వతీపురం డిపోలో ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు

Parvathipuram: పార్వతీపురం ఆర్టీసీ డిపోలో 50 మందికి పైగా ఉద్యోగులకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ (NCD) పరీక్షలు నిర్వహించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 21 May 2026 7:32 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం డిపోలో ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు

పార్వతీపురం : జీవనశైలి వ్యాధులైన రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండాలని, లేకపోతే ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. పార్వతీపురం ఆర్.టి.సి డిపో లో ఉద్యోగులకు గురువారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్.సి.డి పరీక్షలు నిర్వహించారు. వైద్య అధికారులతో కలిసి డిఎంహెచ్ఓ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డ్రైవర్స్, కండక్టర్స్, ఇతర ఆర్.టి.సి ఉద్యోగులకు వైద్య సిబ్బంది బిపి, షుగరు, బి.ఎం.ఐ పరీక్షలు జరిపారు. ఏబై మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ జీవనశైలి మార్పు, ఒత్తిడితో రక్తపోటు, షుగరు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, దీని కారణంగా మెదడు, గుండె, నరాలు, కిడ్నీ లపై చెడు ప్రభావాన్ని చూపిస్తూ అనారోగ్య బారిన పడేస్తుందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఉచిత వైద్య పరీక్షలను ఎప్పటికపుడు చేయించుకొని వైద్యుల సూచనలు పాటించాలన్నారు. యోగా , సాదారణ వ్యాయామంతో ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story