Parvathipuram: బిడ్డకు తల్లిపాలే సంజీవని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి!
Parvathipuram: పార్వతీపురంలో తల్లిపాల వారోత్సవాల అవగాహన ర్యాలీ. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలల వరకు ప్రత్యామ్నాయ పాలు వద్దని డిఎంహెచ్ఓ స్పష్టం.
Parvathipuram: బిడ్డకు తల్లిపాలే సంజీవని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి!
పార్వతీపురం: ఆరు నెలలు పూర్తయ్యే వరకు బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలు బిడ్డకు ఆరోగ్య రక్షణ కలిగిస్తాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి అన్నారు. తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించి అవగాహన నినాదాలతో కొనసాగించారు. తల్లిపాల ఆవశ్యకత, మార్గదర్శకాలపై అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు తప్పని సరిగా ఇవ్వాలని, రోగనిరోధకశక్తి వృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.
మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలే కొనసాగించాలని ప్రత్యామ్నాయ పాలు అవసరమైతే వైద్యుని సూచనతో మాత్రమే ఇవ్వాలన్నారు. తల్లిపాలు బిడ్డకు ఉత్తమ ఆహారం అని సంజీవనిలా పనిచేస్తుందని తెలిపారు. వైద్య, ఐసిడిఎస్ ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో తల్లిపాలు ప్రాముఖ్యత, ఆవశ్యకత పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఐఓ డా. వై. విజయ్ మోహన్, ఆర్.బి.ఎస్.కె పిఓ డా. టి. జగన్ మోహనరావు, డిపిఎంఓ రవికుమార్ రెడ్డి, డిఎంఓ సూర్యనారాయణ, డిప్యూటీ డెమో లు గిరిబాబు, ప్రసాద్, డిపిఓ లీలారాణి, డిపిహెచ్ఎన్ఓ విజయలక్ష్మి, డిసిఎం విజయలత, సూపర్వైజర్స్ పుష్ప, ఇందిర కార్యాలయ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




