Parvathipuram: ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Parvathipuram: పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి తనిఖీ చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 22 July 2026 1:06 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పార్వతీపురం: పట్టణ ప‌రిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వ‌ద్ద గల ఈవీఎం, వీవీపాట్స్ గోదామును జిల్లా క‌లెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీలో భాగంగా బుధవారం ఆయ‌న గోదాములను సంద‌ర్శించి అక్క‌డ పరిస్థితిని గ‌మ‌నించారు. గోదాములకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం పర్యవేక్షణ రిజిష్టరులో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ, అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈవీఎం గోదాము పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం గోదామును తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామన్నారు.

ఈ పరిశీలనలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, మునిసిపల్ కమిషనర్ పి.శ్రీనివాస రాజు, తహసీల్దార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story