Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా 'గంటేడ సాహిత్య స్వర్ణోత్సవాలు'

Parvathipuram: పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆగస్టు 7, 8 తేదీల్లో ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు 75వ జన్మదినం సందర్భంగా 'సాహిత్య స్వర్ణోత్సవాలు' నిర్వహించనున్నారు

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 4 Aug 2026 1:06 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా 'గంటేడ సాహిత్య స్వర్ణోత్సవాలు'

పార్వతీపురం మన్యం జిల్లా..

ఈనెల 7, 8 తేదీల్లో పార్వతీపురం జిల్లా కేంద్రంలో "గంటేడ సాహిత్య స్వర్ణోత్సవ కార్యక్రమాలు

పార్వతీపురం:ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ కథారచయిత,కవి, విశ్లేషకులు, గాయకులు గంటేడ గౌరునాయుడు 75ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భముగా పార్వతీపురం స్నేహకళాసాహితి "గంటేడ సాహిత్య స్వర్ణోత్సవం" పేరిట రెండురోజులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్నేహకళా సాహితి వ్యవస్థాపక కార్యదర్శి జి. రామకృష్ణ, అధ్యక్షులు జగదీష్, కార్యదర్శి పక్కిరవీంద్రనాథ్ లు తెలిపారు. పార్వతీపురం మన్యం కళావేదికలో(ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో) 7వతేదీన పాడుదమా స్వేచ్ఛాగీతం కార్యక్రమాన్ని బి.వెంకటరావు అధ్యక్షతన నిర్వహిస్తామని, ఈకార్యక్రమంలో డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు, డాక్టర్ డి. వెంకటరావు, డి. గణపతరావు, యేటూరి నాగేశ్వరరావు, గాయకులు డప్పు శ్రీను, రావులపల్లి మోహన్, చల్లా శ్రీధర్లు పాల్గొంటారన్నారు. ఈనెల 8న ఉదయం "గంటేడ సాహిత్య స్వర్ణోత్సవం" కార్యక్రమానికి మల్లిపురం జగదీష్ అధ్యక్షత వహిస్తారని, ప్రొఫెసర్ చింతకింది కాశీం ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. గంటేడ రచించిన "నేస్తం" ( కందాలొకవంద) పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరణచేస్తారని తెలిపారు. అనంతరం గంటేడ కథలు- ఒక పరిశీలన పై పుష్పాల శ్రీరామ్ వక్తగా పాల్గొని మాట్లాడతారని తెలిపారు. రెండవ పూట గంటేడ కవిత్వం విశ్లేషణపై జరిగే కార్యక్రమానికి గోవిందు కృష్ణారావు అధ్యక్షత వహిస్తారని, సుంకరగోపాలయ్య వక్తగా మాట్లాడతారని తెలిపారు. గంటేడ పద్యం, గజల్- సమీక్ష కార్యక్రమంపై పాయల మురళీకృష్ణ వక్తగా మాట్లాడతారని తెలిపారు. రెండు రోజుల కార్యక్రమాలపై ప్రముఖ కథారచయిత గంటేడ గౌరునాయుడు ప్రతిస్పందనతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. జిల్లాలో నిర్వహించే సాహిత్యకార్యక్రమానికి పెద్ద ఎత్తున సాహిత్య వేత్తలు, రచయితలు, కవులు, సాహిత్య అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని స్నేహ కళాసాహితి నిర్వాహకులు కోరారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story