Parvathipuram: మన్యం విద్యార్థులకు ‘మలేరియా’ నివారణ మందులు!
Parvathipuram: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని హాస్టళ్ళు, పాఠశాలల్లో మలేరియా నివారణ మందుల పంపిణీ ముమ్మరం. 18,983 మంది విద్యార్థులకు ఆయుష్ డోసుల పంపిణీ.
Parvathipuram: మన్యం విద్యార్థులకు ‘మలేరియా’ నివారణ మందులు!
Parvathipuram: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ముమ్మరంగా మలేరియా నివారణ మందుల పంపిణీ చేసినట్లు జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ బి.సుశీల తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు ఆయుష్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్టళ్ళలో మలేరియా నివారణ మందుల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందన్నారు .
ఈ నివారణ చర్యల్లో భాగంగా గరుగుబిల్లి మండలం ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ కె.కె.వర్మతో కలిసి 18,983 మంది విద్యార్థులకు 56,919 డోసుల మందులను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో మన్యం ప్రాంత విద్యార్థులు మలేరియా బారిన పడకుండా ముందస్తు రక్షణ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి షెడ్యూల్ ప్రకారం డోసులు అందేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.




