Parvathipuram: వర్షాల నేపథ్యంలో మన్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Parvathipuram: మన్యం అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సూచన.
Parvathipuram: వర్షాల నేపథ్యంలో మన్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Parvathipuram: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. వర్ష తీవ్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నదులు, వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్న కల్వర్టులు దాటేందుకు ఎవరూ సాహశించవద్దని, వర్షాల సమయంలో పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని ప్రజలను కోరారు. వర్షపాతం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రాల్లో 24/7 అత్యవసర కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్, పోలీసు శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు అందించాలని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాలు, గిరిశిఖర గ్రామాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా పునరావాస కేంద్రాలను సిద్ధం ఉన్నాయని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్థానిక అధికారులను గానీ, కంట్రోల్ రూమ్ నంబర్లను గానీ సంప్రదించి, ప్రభుత్వం జారీ చేసే సూచనలను పాటిస్తూ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కలెక్టర్ కోరారు




