Parvathipuram: వెంగాపురంలో కలెక్టర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ సోమవారం బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో పర్యటించారు.
Parvathipuram: వెంగాపురంలో కలెక్టర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ
Parvathipuram: సామాజిక భద్రతా పథకాల అమలులో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ప్రతీకగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ సోమవారం బలిజిపేట మండలం వెంగాపురం గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారుల గృహాల వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాలను అందజేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు పెన్షన్లు నిరంతరాయంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డి ఆర్డిఎ పిడి, సిహేచ్ ప్రభావతి, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.




