Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాకు తీవ్ర ఎండల హెచ్చరిక

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎండల తీవ్రతపై కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి తీవ్ర అప్రమత్తత ప్రకటించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 2 Jun 2026 5:09 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాకు తీవ్ర ఎండల హెచ్చరిక

Parvathipuram: రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సంస్థ జూన్ 2న విడుదల చేసిన వాతావరణ సూచనల ప్రకారం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి సూచించారు. హీట్ ఇండెక్స్ ఫోర్‌కాస్ట్ ప్రకారం 41 నుంచి 54 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో 15 మండలాలను "డేంజర్ కేటగిరీ"గా గుర్తించినట్లు తెలిపారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ మండలాలు ఉన్నాయి.

ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని తెలిపారు. రైతులు, కూలీలు మరియు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, తరచూ నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి సూచించారు. సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story