Parvathipuram: మన్యం జిల్లా కోర్టు ప్రాంగణంలో పర్యావరణ దినోత్సవం
Parvathipuram: భూమిని భావితరాలకు సురక్షితంగా అందించాలంటే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి పేర్కొన్నారు.
Parvathipuram: మన్యం జిల్లా కోర్టు ప్రాంగణంలో పర్యావరణ దినోత్సవం
Parvathipuram: భూమిని భావితరాలకు సురక్షితంగా అందించాలంటే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం. మాధురి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం. మాధురి, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొని మొక్కలు నాటారు.
అనంతరం నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాధురి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, హరిత వాతావరణ నిర్మాణం అవసరాన్ని వివరించారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, వ్యర్థాల సరైన నిర్వహణ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించడంతో పాటు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛమైన, హరిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, మండల న్యాయ సేవా అధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.




