Parvathipuram: నాన్-సిగ్నల్ గ్రామాల్లో భూ రీ-సర్వే పనులు వేగవంతం చేయండి

Parvathipuram: నెట్‌వర్క్ సిగ్నల్స్ లేని మారుమూల గ్రామాల్లో భూ రీ-సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Updated on: 21 July 2026 5:00 PM IST
Parvathipuram
X

Parvathipuram: నాన్-సిగ్నల్ గ్రామాల్లో భూ రీ-సర్వే పనులు వేగవంతం చేయండి

​పార్వతీపురం: జిల్లాలో నెట్ అందుబాటులో లేని గ్రామాల రీ-సర్వే పనులను వెంటనే పూర్తి చేయాలనిజాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి సర్వే అధికారులను, డ్రోన్ డిస్టినేషన్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

నాన్-సిగ్నల్ గ్రామాల్లో సర్వే నిర్వహణలపై సర్వే శాఖ సహాయ సంచాలకులు, డ్రోన్ డిస్టినేషన్ కంపెనీ ప్రతినిధులు, సర్వేయర్లతో మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ మందిరం లో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నెట్‌వర్క్ సౌకర్యం లేని (నాన్-సిగ్నల్) గ్రామాల్లో సర్వే ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సర్వేకు అవసరమైన సిబ్బంది, పరికరాలను అందించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా నెట్‌వర్క్ సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాల్లో డేటా సేకరణ ఏ విధంగా జరుగుతోంది, సేకరించిన డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధానాలు, ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులపై ప్రత్యేకంగా సమీక్షించి పలు సూచనలు చేశారు.సర్వే నాణ్యత తనిఖీలలో భాగంగా మూడు గ్రామాలకు చెందిన డేటాను, సేకరణ అనంతరం చేపట్టే కంప్యూటరీకరణ ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు.

ప్రజలకు ఎటువంటి తప్పులు లేని, అత్యంత ఖచ్చితమైన భూ రికార్డులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కావున పనుల్లో నాణ్యతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశించుకున్న నిర్ణీత కాల వ్యవధిలోనే రీ-సర్వే ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సర్వే శాఖ సహాయ సంచాలకులు టి. విగ్నేశ్వర రావు, అనురాగ్ డ్రోన్ డిస్టినేషన్ కంపెనీ ప్రతినిధులు, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story