Parvathipuram: జియ్యమ్మవలస–వీరఘట్టం మధ్య నిలిచిన రాకపోకలు!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో రాళ్లగెడ్డ ఉధృతి: రోడ్డుపై నడుములోతు వరద నీరు, నిలిచిన రాకపోకలు.. వంతెన నిర్మించాలని స్థానికుల డిమాండ్.
Parvathipuram: జియ్యమ్మవలస–వీరఘట్టం మధ్య నిలిచిన రాకపోకలు!
Parvathipuram: గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని రాళ్లగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రధాన రహదారిపై నడుములోతు వరకు చేరడంతో జియ్యమ్మవలస–వీరఘట్టం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ప్రయాణించే వారు కూడా గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు స్థానికులు రహదారికి అడ్డంగా కర్రను ఏర్పాటు చేసి, వరద ఉద్ధృతి తగ్గే వరకు గెడ్డ దాటవద్దని హెచ్చరిస్తున్నారు.
ప్రవాహం తీవ్రంగా ఉన్నందున ఎవరూ గెడ్డ దాటేందుకు ప్రయత్నించవద్దని స్థానికులు సూచిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు, ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారంగా రాళ్లగెడ్డపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




