పార్వతీపురం మన్యం జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక గర్జన.. పోలీసుల భారీ అవగాహన కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది.

V.SESHU	, KURUPAM
Updated on: 10 May 2026 8:52 PM IST
పార్వతీపురం మన్యం జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక గర్జన.. పోలీసుల భారీ అవగాహన కార్యక్రమం
X

పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని కురుపాం, చినమేరంగి, పార్వతీపురం రూరల్ (నేరెళ్లవలస), సీతంపేట, వీరఘట్టం , కొమరాడ తదితర ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేశారు.

​ఆరోగ్యంపై ప్రభావం - చట్టపరమైన చర్యలు

​ఈ సందర్భంగా పలువురు వక్తలు మరియు ఎస్.ఐ లు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్ బానిసలుగా మారడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చట్టపరమైన శిక్షలు ఉంటాయని, ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

​ప్రతిజ్ఞ మరియు అవగాహన

​కార్యక్రమంలో భాగంగా ప్రజలందరితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా పార్వతీపురం మన్యంను ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవగాహన పెంచేందుకు రూపొందించిన ప్రత్యేక ఆడియో క్లిప్పులను గ్రామాలలోని కూడళ్లలో ఏర్పాటు చేసి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

​ఈ కార్యక్రమంలో ఎల్విన్‌పేట సీఐ హరి, చినమేరంగి సిఐ తిరుపతి రావు,సీతంపేట, కురుపాం, వీరగట్టం, చినమేరంగి ఎస్.ఐలు, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story