Parvathipuram: అనుమతులు లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు: ఐటీడీఏ పీఓ!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న సంచి డాక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ పీఓ హెచ్చరించారు.
Parvathipuram: అనుమతులు లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు: ఐటీడీఏ పీఓ!
పార్వతీపురం: అనుమతులు లేకుండా సంచి డాక్టర్లు వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పిఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ స్పష్టం చేశారు. సీతం పేట మెయిన్ రోడ్డులో ఎటువంటి అనుమతులు లేకుండా వైద్య చికిత్సలు నిర్వహిస్తున్న సంచి డాక్టర్ను వైద్య తనిఖీల్లో భాగంగా వైద్య బృందం, పోలీసు సిబ్బంది పట్టుకున్నారు.
కొత్తూరు మండలానికి చెందిన సంచి డాక్టర్ అనుమతులు లేకుండా వైద్యం చేస్తూ వైద్య బృందం, పోలీసు సిబ్బంది అతడిని విచారించగా, వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అనుమతులు, ఆర్.ఎం.పి. వైద్య అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు లేదా లైసెన్స్ ఏవీ లేనట్లు గుర్తించారు.
ఎటువంటి అనుమతు లు, అర్హతలు లేకుండా వైద్య చికిత్సలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇకపై ఎవరూ అనుమతులు లేకుండా వైద్య చికిత్సలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పిఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దోనుబాయి పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ శివశంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




