Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో 700 మందితో కట్టుదిట్టమైన భద్రత

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, 700 మంది సిబ్బంది, చెక్‌పోస్టులతో పహారా కాస్తున్నామని ఎస్పీ తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 17 Oct 2026 12:33 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో 700 మందితో కట్టుదిట్టమైన భద్రత

Parvathipuram: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు.

నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ​జిల్లాలో ప్రధాన పట్టణాలైన సాలూరు, పార్వతీపురం, పాలకొండ సరిహద్దుల్లోని ఏడు చెక్‌పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో, సరైన పత్రాలు లేకుండా నగదు, బహుమతులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.

ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ (FST), స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు (SST) రేయింబవళ్లు నిఘా ఉంచాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.

నామినేషన్ల నుంచి పోలింగ్ ముగిసే వరకు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు పాలు కావాల్సిందేనని ఎస్పీ హెచ్చరించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)