Parvathipuram: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత.. ఎస్పీ
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో "పోలీస్ వెల్ఫేర్ డే".
Parvathipuram: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత.. ఎస్పీ
Parvathipuram: పార్వతీపురం:పోలీసు సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి, సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి చర్యలు చేపడతానన్న జిల్లా ఎస్పీ గారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది శాఖాపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికి పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,
ఐపిఎస్ గారు జూన్ 19న జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో "పోలీస్ వెల్ఫేర్ డే" (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది పాల్గొని వారికి ఉన్న సమస్యలను ఎస్పీ గారికి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ గారు పోలీసు సిబ్బంది ఒక్కొక్కరితో సమావేశమై వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
“పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించుటలో భాగంగా పోలీసు సిబ్బంది ఒక్కొక్కరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారిని కలిసి తమ వ్యక్తిగత, శాఖా,ఆరోగ్యపరమైన సమస్యలు విన్నవించుకోగా, జిల్లా ఎస్పీ గారు వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు.
జిల్లా ఎస్పీగారు సిబ్బంది వ్యక్తిగత, శాఖాపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలను తెలుసుకొని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానన్నారు. తనకు వచ్చిన విన్నపాల్లో పోలీసు సిబ్బంది అనారోగ్యపరమైన సమస్యలు, బదిలీలు కోరుతూ వచ్చినవే ప్రధానంగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.




