Parvathipuram: ముగిసిన శ్రీ జాకరమ్మ మెగా క్రికెట్ టోర్నీ: విజేతగా పార్వతీపురం మాస్టర్స్!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సింగుపురంలో నెల రోజులుగా జరిగిన శ్రీ జాకరమ్మ మెగా క్రికెట్ టోర్నీ ముగిసింది.

V.SESHU	, KURUPAM
Published on: 14 May 2026 6:44 AM IST
Parvathipuram
X

Parvathipuram: ముగిసిన శ్రీ జాకరమ్మ మెగా క్రికెట్ టోర్నీ: విజేతగా పార్వతీపురం మాస్టర్స్!

కురుపాం (పార్వతీపురం మన్యం): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మడి గూడ పంచాయతీ సింగుపురంలో గత నెల రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన శ్రీ జాకరమ్మ మెగా క్రికెట్ టోర్నమెంట్‌లో పార్వతీపురం మాస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుపై ఘన విజయం సాధించింది.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కురుపాం ఎస్సై పి. నారాయణ రావు విజేతలకు రూ.20,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన పి.టి. మండ జట్టుకు రూ.10,000 నగదు, ట్రోఫీని, తృతీయ స్థానం సాధించిన జి.ఎల్. పురం జట్టుకు రూ.3,000 నగదు, ట్రోఫీని బహూకరించారు.

60 జట్లతో హోరాహోరీ: ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు విద్యాసాగర్, భాస్కరరావు, పోలిరాజు, శ్రీధర్ మాట్లాడుతూ, ఈ మెగా టోర్నీలో మొత్తం 60 జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నీని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

విజేతలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ కప్‌లు, షీల్డ్‌లను అందజేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా టోర్నీ నిర్వహణకు ఎల్విన్‌పేట సీఐ బి. హరి, ఎస్సై నారాయణ రావు మేనేజ్‌మెంట్ కమిటీకి 100 టెన్నిస్ బాల్స్‌తో పాటు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు, గ్రామస్తులు పాల్గొని ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. టోర్నీని విజయవంతం చేసిన అన్ని జట్లకు, సహకరించిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story