Parvathipuram: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

Parvathipuram: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మెప్మా కార్యక్రమంలో మహిళలకు ఎగ్ కార్డ్స్ పంపిణీ చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 27 April 2026 8:23 PM IST
Parvathipuram
X

Parvathipuram: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

Parvathipuram: రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుండి ఒక వ్యాపారవేత్త రావాలన్నది విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. సోమవారం పార్వతీపురం మెప్మా కార్యక్రమంలో మహిళలకు ఎగ్ కార్డ్స్, హోమ్ కంపోస్ట్ బిన్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర, ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలంలో అవసరాలకు తగ్గట్టుగా కుటుంబంలో తలసరి ఆదాయం పెరగాలని సదుద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.

ఎగ్ కార్డ్స్ ద్వారా మహిళలు నెలకు కనీసం 5 నుండి 10 వేలు సంపాదించుకోవచ్చునని, తద్వారా కుటుంబ అవసరాలకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని చెప్పారు. రాజస్థాన్ ప్రజల మాదిరిగా ఇంట్లో వాళ్ళందరూ వ్యాపారం చేసి ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, మెప్మా అధికారులు, ఆర్. పి లు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story