Parvathipuram: వెంకంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దంపతులు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌లో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 5 Nov 2026 10:44 AM IST
Parvathipuram
X

Parvathipuram: వెంకంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దంపతులు!

Parvathipuram: పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు, ఆయన సతీమణి శ్రీమతి అనూష గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వెంకంపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే విజయచంద్ర దంపతులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అలాగే, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తారనే ధీమాను ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)