Parvathipuram: గొచక్క, లిడికివలసలో 'ఇంటింటికీ తెలుగుదేశం' ఎమ్మెల్యే విజయ్ చంద్ర

Parvathipuram: పార్వతీపురం మండలం గొచక్క, లిడికివలసల్లో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటన. 'ఇంటింటికీ తెలుగుదేశం'లో భాగంగా కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 29 July 2026 4:53 PM IST
Parvathipuram
X

Parvathipuram: గొచక్క, లిడికివలసలో 'ఇంటింటికీ తెలుగుదేశం' ఎమ్మెల్యే విజయ్ చంద్ర

పార్వతీపురం: తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయ చంద్ర గారు బుధవారం పార్వతీపురం మండలం గొచక్క, లిడికివలస గ్రామంలోని విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి , రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

అలాగే సూపర్ సిక్స్ హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ఇంటింటికీ చేరవేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారికి ఘన స్వాగతం పలికి, తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story