Parvathipuram: పార్వతీపురంలో వ్యవసాయాభివృద్ధి.. మంత్రి అచ్చెన్నాయుడి హామీ!
Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిశారు.
Parvathipuram: పార్వతీపురంలో వ్యవసాయాభివృద్ధి.. మంత్రి అచ్చెన్నాయుడి హామీ!
పార్వతీపురం: పార్వతీపురం నియోజకవర్గ రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు పశుసంవర్ధక శాఖల మంత్రి, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న చిన్న, సన్నకారు రైతుల అవసరాలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గారు, ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు తదితర సబ్సిడీ పథకాల కింద నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యతనిచ్చి అధిక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, పార్వతీపురం నియోజకవర్గ రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సానుకూలంగా స్పందిస్తూ పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు ఈ సందర్భంగా తెలిపారు.




