Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా 200 అడుగుల జెండాతో తిరంగా ర్యాలీ!
Parvathipuram: పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. 200 అడుగుల భారీ జాతీయ జెండాతో స్థానికులు నినాదాలు చేశారు.
Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా 200 అడుగుల జెండాతో తిరంగా ర్యాలీ!
Parvathipuram: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముందస్తుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని, ప్రతి ఒక్కరి నాలుకపై “వందేమాతరం”, “భారత్ మాతాకీ జై” అనే నినాదాలు మార్మోగాలని పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలకు అతీతంగా మనందరినీ ఒక్కటిగా నిలబెట్టేది ‘భారతీయుడు’ అనే గర్వించదగిన గుర్తింపు అని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు.
వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే అత్యున్నతమనే భావనతో ముందుకు సాగడమే ఎన్డీయే ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా 200 అడుగులకు పైగా పొడవైన భారీ జాతీయ జెండాతో పిల్లలు, యువత, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదు.. అది మన దేశ గౌరవానికి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు, 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. 2047 నాటికి ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారతదేశాన్ని నిలపాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి భారతీయుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
దేశభక్తి ప్రతి గుండెల్లో నిండాలని, జాతీయ సమైక్యత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తన ప్రసంగాన్ని “భారత్ మాతాకీ జై!” “వందేమాతరం!” అనే నినాదాలతో ముగించారు.




