Parvathipuram: కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే విజయచంద్ర ప్రచారం!

Parvathipuram: పార్వతీపురం మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే విజయచంద్ర ఇంటింటి ప్రచారం. చైర్మన్ అభ్యర్థి బెలగం కరుణ గెలుపునకు మద్దతు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 Oct 2026 8:31 PM IST
Parvathipuram
X

Parvathipuram: కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే విజయచంద్ర ప్రచారం!

పార్వతీపురం: పార్వతీపురం మున్సిపాలిటీ లో గత పాలకవర్గంలో అభివృద్ధి పడకేసిందని, పార్వతీపురం మున్సిపాలిటీ లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని ఎమ్మెల్యే విజయ చంద్ర అన్నారు. ఈ సాయంత్రం పార్వతీపురం మున్సిపాలిటీ లోని 31, 35 వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు.

31వ వార్డు లోని రెడ్డి వీధి, టౌన్ నాయుడు వీధి, 35వ వార్డు లోని పండా వీధిలో.. చైర్మన్ అభ్యర్థి బెలగం కరుణ, 31వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మంత్రి రవికుమార్ , 35వ వార్డు జనసేన అభ్యర్థి సరిపల్లి అశ్వినితో కలిసి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

కూటమి పార్టీల చైర్మన్ అభ్యర్థి బెలగం కరుణ ను, కౌన్సిలర్ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ.. పార్వతీపురం మున్సిపాలిటీ కోసం కూటమి ప్రభుత్వం తెచ్చిన నిధులను కూడా గత పాలకవర్గం ఖర్చు పెట్టనివ్వలేదని, సొంత లాభాలు చూసుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇప్పటికే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, ఇక్కడ కూడా కూటమి పాలకవర్గం వస్తే.. డబుల్ స్పీడ్ లో పార్వతీపురం మున్సిపాలిటీ ని మరింత అభివృద్ధి చేయవచ్చని ఎమ్మెల్యే విజయ చంద్ర అన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)