Parvathipuram: సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం విజయచంద్ర
Parvathipuram: పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ప్రజాదర్బార్. పింఛన్లు, గృహాలు, భూ సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకరణ, అధికారులకు ఆదేశాలు.
Parvathipuram: సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం విజయచంద్ర
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలు వినతులు అందించిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా పింఛన్లు, గృహాలు, ఇళ్ల స్థలాలు, విద్యుత్, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయచంద్ర సంబంధిత అధికారులతో తక్షణమే ఫోన్‌లో మాట్లాడి, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
మిగిలిన సమస్యలను కూడా ప్రాధాన్యత ఆధారంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే విజయచంద్ర ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.




