Parvathipuram: పార్వతీపురం డీఅడిక్షన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన వైద్యాధికారి
Parvathipuram: పార్వతీపురం జిల్లా పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎన్‌సీడీ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు. వ్యసనపరుల చికిత్సపై సమీక్ష.
Parvathipuram: పార్వతీపురం డీఅడిక్షన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన వైద్యాధికారి
పార్వతీపురం: మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆరోగ్యానికి పెను ముప్పు తప్పదని, వ్యసనపరులను డీఅడిక్షన్ కేంద్రంలో చేర్చి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. మాదక ద్రవ్య వ్యసన పరుల జిల్లా పునరావాస కేంద్రాన్ని (డిడిఎసి) మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ నెలలో ఇంతవరకు ఎంతమందిని డీఅడిక్షన్ కేంద్రంలో చేర్చారు , వారికి అందిస్తున్న వైద్య సేవలు, కౌన్సెలింగ్ ప్రక్రియ, సౌకర్యాలు, పర్యవేక్షణ అంశాలపై వైద్యులు,సిబ్బందితో సమీక్షించి రికార్డులు పరిశీలించారు. డిశ్చార్జ్ సమయానికి వారి వ్యసన అలవాట్ల పట్ల విముఖత, ఆరోగ్యం మెరుగుపై తెలుసుకున్నారు.
అనంతరం డా. జగన్ మాట్లాడుతూ ఆల్కహాల్, గుట్కా,గంజాయి,పొగాకు ఉత్పత్తులు మొదలగు వ్యసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుందని ఇలాంటి వారిని త్వరగా గుర్తించి పునరావాస కేంద్రంలో చేరేలా చూడాలని తద్వారా వారి ఆరోగ్యం, కుటుంబ జీవన ప్రమాణాలు మెరుపడతాయన్నారు.
అయితే కొన్ని లక్షణాలతో వీరిని సులభంగా గుర్తించవచ్చని, ముఖ్యంగా అస్పష్టమైన ప్రసంగం, సమన్వయలోపం, ఏకాగ్రత సమస్యలు, అసంకల్పిత కంటి కదలికలు,చేతులు వణకటం, నిద్రమత్తు లేదా నిద్రలేమి, నిరోధం లేకపోవడం. ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయి అవగాహన కార్యక్రమాలు సమన్వయంతో చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డా. సిహెచ్. స్వరూప్, స్టాఫ్ వెంకటలక్ష్మి, సూపర్వైజర్ జయగౌడ్ తదితరులు ఉన్నారు.




