Parvathipuram: పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 'స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం
Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ కార్యాలయాలు, పరిసరాలను శుభ్రం చేసిన అధికారులు, సిబ్బంది.
Parvathipuram: పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 'స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం
పార్వతీపురం: దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జూలై 18న ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో అధికారులు ,సిబ్బంది పోలీస్ కార్యాలయం ప్రాంగణం, క్యాంపు ఆఫీస్,STF బ్యారక్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రం చేశారు.
గడ్డపారలు, గుణపాలు చేతపట్టి చుట్టుపక్కల పరిసరాలలో వుండే చెత్తాచెదారం,పిచ్చిమొక్కలను,పచ్చికను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. చిన్న చిన్న గుంతలును పూడ్చారు.ఎస్పీ గారి పిలుపు మేరకు ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల, ఎస్డిపిఓ, సర్కిల్ కార్యాలయాల అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వారి స్టేషన్లు/కార్యాలయాలు శుభ్రం చేయడంతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలలో వుండే చెత్తా చెదారం, పిచ్చిమొక్కలను,పచ్చికను తొలగించి పరిశుభ్రం చేశారు.
ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో డిఎస్పీ గారితో పాటుగా ఆర్ఐ లు రాంబాబు,నాయుడు ఆర్ఎస్ఐలు మరియు ఇతర అధికారులు,సిబ్బంది* పాల్గొన్నారు.




