Parvathipuram: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నిరసన కలెక్టరేట్ ముట్టడి

Parvathipuram: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని పార్వతీపురంలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 3 July 2026 1:37 PM IST
Parvathipuram
X

Parvathipuram: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నిరసన కలెక్టరేట్ ముట్టడి

పార్వతీపురం: సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘాల నాయకులు మాట్లాడుతూ జూన్ 8వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏసఎంఎస్ ` 1 డిపార్ట్మెంట్లో హాట్ మెటల్ తీసుకువెళ్తున్న లేడర్ ప్రమాదంలో 10 మంది కార్మికులు మరణించారు. ఆరుగురు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదాలకు పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలే. నాసిరకమైన ముడి సరుకును వాడడం, యంత్రాలను మరమ్మత్తుల చేయకపోవడం, అనుభవం ఉన్న సిబ్బందిని తొలగించడం, కార్మికులపై విపరీతంగా పని భారం మోపడం వెరసి ఈ ప్రమాదానికి కారణమైంది.చనిపోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. క్షతగాత్రులకు 50 లక్షల రూపాయలు చెల్లించాలి. ఘటన పై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలి.

భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తున్నది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే ఆపాలని, ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక జిల్లా కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. మన్మధరావు గొర్ల వెంకటరమణ బివి రమణ,ఆర్ వేణు,ఐఎన్టీయూసీ వంగల దాలినాయుడు, భాస్కర్ రావు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story