Parvathipuram: పార్వతీపురం కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి నిరసన
Parvathipuram: ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్వతీపురంలో వివిధ ప్రజా సంఘాల నిరసన.
Parvathipuram: పార్వతీపురం కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి నిరసన
పార్వతీపురం: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల కృష్ణ పత్రాల లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని, ఈ సమస్యపై గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ వేత్త "సోనంవాంగ్ చుక్" దీక్ష భగ్నానికి పూనుకున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఆదివాసి గిరిజనసంఘం, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్య ప్రవేశ పరీక్ష పత్రాలను రాజకీయ నాయకుల అండతో కొంతమంది లీకేజీకి పాల్పడ్డారని, ప్రవేశ పరీక్షలు వ్యవస్థలో ఇలాంటి దారుణలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ పెద్దలు ఎప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమస్యపై గత 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ పర్యావరణ వ్యాప్త సోనం వాంగ్చ్ మరియు విద్యార్థి నేతలు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలను భగ్నం చేసిన ప్రభుత్వం వారు లేవనెత్తిన సమస్య యొక్క తీవ్రతను గమనించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎప్పటికైనా కాన్సర్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి చేసి ఉద్యమకారుడు లేవనెత్తు అంశాలపై స్పష్టమైన విధానాలు రూపొందించాలని, ప్రవేశ పరీక్షలను యొక్క విధానంలో లోపల సవరించాలని డిమాండ్ చేశారు.




