Parvathipuram: మరొక్క వారమే.. పార్వతీపురం మన్యం జిల్లా రేషన్ డీలర్లకు పోస్టింగ్ ఆర్డర్లు!
Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అమరావతి సచివాలయంలో సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులను కలిశారు.
Parvathipuram: మరొక్క వారమే.. పార్వతీపురం మన్యం జిల్లా రేషన్ డీలర్లకు పోస్టింగ్ ఆర్డర్లు!
పార్వతీపురం: అమరావతి పర్యటనలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోనెల విజయచంద్ర వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీ కె. కన్నబాబు, IAS, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్. దిల్లీరావు, IASలను కలిసి పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో రేషన్ డీలర్ నియామకాల కోసం ఇంటర్వ్యూలు పూర్తై ఏడాది గడిచినా పోస్టింగ్ ఆర్డర్లు జారీ కాకపోవడంతో ఎదురుచూస్తున్న అభ్యర్థుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభ్యర్థుల తరఫున వెంటనే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేసి రేషన్ షాపుల నిర్వహణకు అవకాశం కల్పించాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
ఈ అంశంపై అధికారులు సానుకూలంగా స్పందించి, వారం రోజుల్లో సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేసి అర్హులైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.పోస్టింగ్ ఆర్డర్ల కోసం ఏడాది కాలం గా ఎదురుచూస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా అభ్యర్థులకు త్వరలోనే న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.




