Parvathipuram: చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: ఆర్బీఎస్‌కే జిల్లా పీఓ జగన్ మోహన్
Parvathipuram: పార్వతీపురంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్బీఎస్‌కే పీఓ డాక్టర్ జగన్ మోహన్, సకాలంలో టీకాలు వేయించి వ్యాధుల నుంచి రక్షణ పొందాలని సూచించారు.
Parvathipuram: చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: ఆర్బీఎస్‌కే జిల్లా పీఓ జగన్ మోహన్
పార్వతీపురం: శిశు మరియు చిన్నారులకు ఆరోగ్యకర భవిష్యత్ అందించడమే ద్యేయంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సమష్టి కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు.
పట్టణంలో గల 12వ వార్డు పరిధి అంగన్వాడీ కేంద్రంలో టీకా కార్యక్రమాన్ని శనివారం తనిఖీ చేశారు. టీకా కార్డులో గడువు తేదీలను పరిశీలించారు. వైద్య సిబ్బంది తదుపరి టీకా వేయాల్సిన తేదీలపై పిల్లల తల్లులకు తెలిజేస్తూ నమోదు చేయాలన్నారు. పిల్లల ఎదుగుదల వివరాలను స్వయంగా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవచ్చని గ్రోత్ చార్ట్ ను అర్థమయ్యే రీతిగా వివరించి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు.
పోలియో, క్షయ, హెపటైటిస్, న్యుమోనియా, కోరింతదగ్గు, ధనుర్వాతం, తట్టు, రూబెల్లా, డిప్తేరియా, అతిసారం తదితర ప్రాణాంత వ్యాదుల నుండి రక్షణగా సకాలంలో టీకాలు వేయాలని తెలిపారు. ఆరు నెలలు నిండిన తర్వాత నుండి ఐదేళ్ల వరకు ప్రతీ వారం రెండు సార్లు ఐరన్ సిరప్ వేయించాలన్నారు.
పిల్లలందరికీ ఆర్.బి.ఎస్.కె స్క్రీనింగ్ పారదర్శకంగా నిర్వహించి 4డి లక్షణాలు గుర్తించాలని ఆదేశించి, ఆన్లైన్ నివేదికలు పరిశీలించారు. డిఈఐసి, ఎన్ఆర్సీ కేంద్రాలను సద్వినియోగం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ రామలక్ష్మి, వైద్య , అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.




