Parvathipuram: పార్వతీపురం రోడ్డు ప్రమాదంలో వృద్ధులను కాపాడిన శక్తి టీం

Parvathipuram: పార్వతీపురం రూరల్ పరిధిలో బైక్ ప్రమాదం. గాయపడిన ఇద్దరు వృద్ధులను శక్తి టీం పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడారు. ఎస్పీ అభినందన.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 17 July 2026 5:52 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం రోడ్డు ప్రమాదంలో వృద్ధులను కాపాడిన శక్తి టీం

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఉత్తర్వులు మేరకు పెట్రోలింగ్లో భాగంగా పార్వతీపురం శక్తి టీం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డాపుశిల గ్రామం దగ్గరలో జనాలు గుమిగూడి వుండగా ఆపి చూడగా ఇద్దరు వృద్ధులు గాయపడి రక్తస్రావంతో కనిపించినారు.

వీరఘట్టం నుండి శ్రీరాములు నాయుడు, మానిఖ్యారావు అను ఇద్దరు వ్యక్తులు AP 31 AK 3277 నెంబర్ గల ద్విచక్ర వాహనం మీద సబ్ రిజిస్టర్ పనిమీద పార్వతీపురం వస్తుండగా మార్గం మధ్యలో కుక్క అడ్డంగా రావడం వలన అదుపు తప్పి పడిపోయినారు.

ఈ ప్రమాదంలో ఇరువురు తీవ్ర గాయాలతో బాధపడుతు 108 కోసం ఎదురు చూస్తుండగా అటుగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పార్వతీపురం శక్తి టీం వారిని గమనించి, తక్షణమే స్పందించి రక్తం ఓడుతున్న ఇద్దరు వృద్ధులను తమ శక్తి వాహనంలో మెరుగైన వైద్య చికిత్స కొరకు హుటాహుటిన పార్వతీపురం జిల్లా హాస్పిటల్ కు తరలించి తక్షణ వైద్య సహాయం అందే విధంగా చేసినారు.

పోలీసు వారు తక్షణమే స్పందించి క్షతగాత్రులను తరలించడం వలన వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని వారి కుటుంబ సభ్యులు, చుట్టూ పక్కల ప్రజలు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాద సంఘటన జరిగిన తక్షణమే స్పందించి క్షతగాత్రులను కాపాడిన పార్వతీపురం శక్తి టీం HC యు గురుమూర్తి, ఉమెన్ కానిస్టేబుల్ జయలక్ష్మి, AR హెడ్ కానిస్టేబుల్ రాంబాబు గార్లు ను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story