Parvathipuram: ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ క్రీడా పోటీలు

Parvathipuram: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులకు క్రీడా పోటీలు. వివరాలు వెల్లడించిన కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి.

V.SESHU	, KURUPAM
Published on: 21 July 2026 7:35 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ క్రీడా పోటీలు

పార్వతీపురం: వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులకు జిల్లా మరియు మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఉద్యోగుల్లో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పెంపొందించడంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ పోటీలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రీడా పోటీలలో పాల్గొనగోరే అధికారులు, ఉద్యోగులు జూలై 22, 23వ తేదీల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కోసం ఉద్యోగి ఐడీ, పనిచేస్తున్న శాఖ మరియు ఆసక్తి ఉన్న క్రీడ వివరాలను డి ఎస్‌ డి ఓ కార్యాలయ ప్రతినిధి కార్తీక్ (ఫోన్ నెంబర్: 73964 23490) కు అందించాలని సూచించారు.

ఈ పోటీలలో భాగంగా పురుషులకు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, కారమ్స్ తో పాటు వంద మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్ జంప్, తాడు లాగుట (టగ్ ఆఫ్ వార్) పోటీలు నిర్వహిస్తారని, ఆదేవిదంగా మహిళా ఉద్యోగులకు షటిల్ బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, 50 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్ జంప్, తాడులాగుట పోటీలతో పాటు వినోదాత్మక క్రీడలైన మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు.

మండల స్థాయిలోని అథ్లెటిక్స్ జూలై 25 వ తేదీ నాటికి , ఇతర క్రీడల పోటీలన్నీ జూలై 31 నాటికి పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఆగస్టు 1 నుండి 10 వరకు జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారు. లీగ్ విధానంలో జరిగే క్రికెట్ పోటీలు వివిధ శాఖలకు చెందిన టీంల మద్య జూలై 26 నుండి 31 వ తేదీల మధ్య జిల్లా స్థాయిలో మాత్రమే జరుగుతాయని, సెమీస్ ఆగస్టు 2వ తేదీన, ఫైనల్ ఆగస్టు 9వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి నోడల్ అధికారిగాను, మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా, ఎంఈఓ, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సహాయ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆగస్టు 15న జరిగే ప్రధాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story