Kurupam: ఆకస్మిక తనిఖీలు: సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశం!
Kurupam: కురుపాం మండలం బల్లుకోటలో జీటీ సర్వే పనులను సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Kurupam: ఆకస్మిక తనిఖీలు: సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశం!
Kurupam: కురుపాం మండలం బల్లుకోట గ్రామంలో నాన్-సిగ్నల్ ఏరియాలో జరుగుతున్న జీటీ (గ్రౌండ్ ట్రూతింగ్) సర్వే పనులను పాలకొండ సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, ఐఏఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కురుపాం తహసీల్దార్‌తో కలిసి సర్వే జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, సర్వే ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భూముల వివరాల నమోదు, సర్వే నిర్వహణ విధానం, రికార్డుల నవీకరణ తదితర అంశాలపై సంబంధిత సిబ్బందితో సమీక్ష నిర్వహించిన సబ్ కలెక్టర్, సర్వే పనులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు.
అలాగే సర్వేలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న భూ సర్వే కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు




