Manyam: వైస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు భారీ ర్యాలీ!
Manyam: కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మోసం చేసిందంటూ వైస్సార్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ.
Manyam: వైస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు భారీ ర్యాలీ!
Manyam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటికీ కుటుంబ అధికారంలోకి వచ్చే రెండేళ్లు పూర్తి చేసుకుని యావత్ రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచి రెండేళ్లు గడిచిపోయాయని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ఆధ్వర్యంలో నేడు చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అలజంగి జోగారావు గారి సారధ్యంలో బలిజిపేట, సీతానగరం, పార్వతిపురం అర్బన్ మరియు రూరల్ మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది.
అదేవిధంగా పార్వతీపురం అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలకు సంబంధించి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో స్థానిక మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అలజంగి జోగారావు గారు పాల్గొని వైయస్సార్ విగ్రహం వద్ద నుంచి మండల రెవెన్యూ ఆఫీస్ వరకు తిరిగి అక్కడి నుంచి వైయస్సార్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టడంతో పాటు ఆర్టీసీ కోడలీ వద్ద టీడీపీ మేనిఫెస్టో, హామీ పత్రాలను, సూపర్ సిక్స్ అడ్వర్టైజ్మెంట్ ఈనాడు పేపర్ కాపీలను అగ్నిలో తగలబెట్టి తమ నిరసనను తెలియజేయడంతో పాటు చంద్రబాబు నాడు రాష్ట్ర ప్రజలకు ఇస్తామనీ చెప్పిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా వాటిని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నీది, మహిళలకు ఉచిత గ్యాస్, 50 ఏళ్లు నిండిన బీసీ సామాజిక వర్గానికి పెన్షన్లు వంటి అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువన ముంచారని కావున ఇప్పటికైనా కూటమి పాలకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి తామిచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలిచి పోరాడుతుందని వారి పక్షాన ఎంత దాకా అయినా వెళ్లడానికి వెనుకాడదని చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వైసిపి వీధి పోరాటానికైనా సిద్ధంగా ఉందని, ఏ పరిస్థితుల్లోను కూటమి ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొని టిడిపి మేనిఫెస్టో పాత్రలను తగలబెట్టి తమ నిరసనలను తెలియజేశారు.




