Proddatur: పాస్టర్ల మధ్య గొడవ.. బేతానియా చర్చికి తాళాలు!
Proddatur: ప్రొద్దుటూరు విజయనగరం వీధిలోని బేతానియా చర్చిలో పాస్టర్ల వివాదం. చర్చికి తాళాలు వేయడంతో రోడ్డుపైనే ప్రార్థనలు చేసిన భక్తులు.
Proddatur: పాస్టర్ల మధ్య గొడవ.. బేతానియా చర్చికి తాళాలు!
Proddatur: చర్చి ఫాస్టర్ల వివాదంతో చర్చికి తాళాలు వేసిన ఘటన ప్రొద్దుటూరు విజయనగరం వీధిలో చోటుచేసుకుంది.. బేతానియా చర్చి పాస్టర్ల మధ్య నెలకొన్న వివాదం తీవ్రతకు దారి తీసింది.
చర్చికి నూతన పాస్టర్ గా వచ్చిన సాల్మాన్ బాబు.. గతంలో ఉన్న పాస్టర్ చర్చి వదిలి వెళ్ళనంటూ పాస్టర్ ఎఫ్రాయిమ్.. రెండు వర్గాల మధ్య జరుగుతున్న అభిప్రాయ బేధాలు శాంతి భద్రతల సమస్యలు దారి తీయకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు.
ఈ క్రమంలో 14 మందిపై తహసిల్దార్ సమక్షంలో బైండవర్ చేసినట్లు అధికారులు తెలిపారు. నేడు ఆదివారం చర్చిలో ప్రార్థనలు జరగకుండా గేటుకు తాళాలు వేసిన పాత పాస్టర్ ఎఫ్రాయిన్.
ప్రార్థనలు జరగాల్సిన సమయంలో చర్చికి గేటుకు తాళాలు వేయడంతో కొత్త పాస్టర్ సాల్మాన్ బాబుతో కలిసి చర్చి బయట రోడ్డుపైన మోకాళ్ళపై కూర్చుని భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఘటన ప్రొద్దుటూరు పట్టణంలో పెద్ద చర్చగా మారింది.




